: నేపాల్ పునర్నిర్మాణానికి 2 బిలియన్ డాలర్లు కావాలి...200 మిలియన్లే ఉన్నాయి: కోయిరాలా


నేపాల్ పునర్నిర్మాణానికి 2 బిలియన్ డాలర్లు అవసరమని ఆ దేశ ప్రధాని సుశీల్ కోయిరాలా తెలిపారు. నేపాల్ పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతానికి నేపాల్ వద్ద 200 మిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. ఇతర నిధులను విదేశాలనుంచి సాయంగా స్వీకరిస్తామని ఆయన వెల్లడించారు. భూకంపం ధాటికి 7,900 మంది మృతి చెందగా, 5,42,000 భవనాలు దెబ్బతిన్నాయి. ప్రజాసంబంధిత కార్యాలయాలు, పాఠశాలల పునర్నిర్మాణ పనులు రెండేళ్లలో పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలు, కళాశాలలు, రోడ్లు, టెలికం సదుపాయాలు, విద్యుత్కేంద్రాలు వంటి వాటిని రెండేళ్లలో పునరుద్ధరిస్తామని ఆయన తెలిపారు. భూకంప బాధితులకు నేపాల్ ప్రభుత్వం 25,000 రూపాయల వరకు 2 శాతం వడ్డీతో గృహ నిర్మాణ రుణాలు అందజేయవచ్చని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News