: నేపాల్ భూకంప మృతుల సంఖ్య 7,912


నేపాల్ భూకంపంలో మృతుల సంఖ్య 7,912కు చేరినట్టు ఆ దేశ హోంశాఖ ఈ రోజు ఓ ప్రకటనలో వెల్లడించింది. అలాగే గాయాలపాలైన వారి సంఖ్య 17,871కు చేరింది. 2,97,266 ఇళ్లు పూర్తిగా దెబ్బతినగా, 10,803 ప్రభుత్వ భవనాలు ధ్వంసమయ్యాయని తెలిపింది. అత్యంత భీకరంగా సంభవించిన ఈ భూకంపంలో 264 మంది నేపాలీలు, 111 మంది విదేశీయులు గల్లంతయ్యారని హోంశాఖ వెల్లడించింది. ఏప్రిల్ 25న నేపాల్, భారత్ లోని కొన్ని రాష్ట్రాల్లో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News