: 5 పైసలు తగ్గిన ఇంటర్ బ్యాంకు ఏటీఎం ఫీజు
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ పీసీఐ) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సేవలందిస్తున్న 1.92 లక్షల ఏటీఎంల నుంచి డబ్బు విత్ డ్రా అయ్యే లావాదేవీలపై వసూలు చేస్తున్న ఫీజు 10 శాతం మేరకు తగ్గింది. ప్రస్తుతం ఒక్కో లావాదేవీకి ఎన్ పీసీఐ 50 పైసలు ఉండగా, ఇప్పుడది 5 పైసలు తగ్గింది. లావాదేవీలు పెరగడం, నెట్ వర్క్ పనితీరు మెరుగుపడడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్ పీసీఐ సీఈఓ ఎ.పి. హోతా వెల్లడించారు. ఈ కొత్త చార్జీలు ఈనెల 1 నుంచి అమల్లోకి వచ్చినట్టని తెలిపారు. కాగా, ప్రస్తుతం ఇతర బ్యాంకుల ఏటీఎంలలో 5 లావాదేవీలకు మించి డబ్బు డ్రా చేస్తే రూ. 20 వరకూ ఛార్జీలు వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే.