: నా కోసం పూజలు చేసిన వారికి కృతజ్ఞతలు: సల్మాన్ ఖాన్
'హిట్ అండ్ రన్' కేసులో సెషన్స్ కోర్టు ఇచ్చిన ఐదేళ్ల జైలు శిక్షను హైకోర్టు సస్పెండ్ చేసిన అనంతరం కండల వీరుడు సల్మాన్ ఖాన్ తొలిసారిగా స్పందించాడు. ఎంతో కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన బాలీవుడ్ తారలకు, అభిమానులందరికీ సల్మాన్‌ఖాన్ కృతజ్ఞతలు తెలిపాడు. ''నా కోసం పూజలు చేసిన వారికి, మద్దతుగా నిలిచిన వారికి మెహర్బానీ, షుక్రియా'' అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశాడు. సల్మాన్ జైలుకు వెళ్లడని తెలుసుకున్న ఆయన అభిమానులు భారీ ఎత్తున టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు.