: బ్రిటన్ ప్రధాని కామెరాన్ కి అభినందనలు తెలిపిన మోదీ


బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ కి భారత ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. యునైటెడ్ కింగ్ డమ్ లో జరిగిన సాధారణ ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడిన సంగతి, ఇందులో డేవిడ్ కామెరాన్ సారథ్యంలోని కన్సర్వేటివ్ పార్టీ జయకేతనం ఎగురవేసిన సంగతి తెలిసిందే. 'మీరు 'ఫిర్ ఏక్ బార్' అన్నట్టుగానే... సరిగ్గా మరోసారి కామెరాన్ ప్రభుత్వం వచ్చింది. మీకు నా అభినందనలు' అని మోదీ పేర్కొన్నారు. కాగా, కామెరాన్ 'ఫిర్ ఏక్ బార్' అంటూ భారతీయ మూలాలున్న ఓటర్లు నివసించే ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే!

  • Loading...

More Telugu News