: ఆర్టీసీ కార్మిక సంఘాలతో ఎండీ చర్చలు విఫలం... సమ్మె యథాతథం


సమ్మె విరమింపజేసేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాలతో ఆ సంస్థ ఎండీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తాము కోరిన 43 శాతం ఫిట్ మెంట్ కు కార్మిక సంఘాల నేతలు వెనక్కి తగ్గలేదు. ఎండీ ఎంత చెప్పినా కార్మికులు పట్టువిడవక పోవడంతో వాగ్వాదం జరిగింది. దాంతో ఇకపై చర్చించేది లేదన్న సాంబశివరావు చర్చల మధ్యలోనే కోపంతో వెళ్లిపోయారు. దాంతో రేపు రెండు రాష్ట్రాల్లోని అన్ని డిపోల్లో వంటావార్పు చేయాలని టీఎంయూ, ఈయూ నేతలు పిలుపునిచ్చారు. మరోవైపు సమ్మె యథాతథంగా జరగనుంది. అనంతరం కార్మిక సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ, చర్చలు విఫలమవడానికి ఎండీ నిరంకుశ వైఖరే కారణమని ఆరోపించారు. సమ్మెను అణచివేయడానికి ఎండీ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News