: అల్లుడు ఆణిముత్యం...మామ స్వాతి ముత్యం: రేవంత రెడ్డి సెటైర్లు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుపై టీడీపీ నేత రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఆయన మాట్లాడుతూ, అల్లుడు ఆణిముత్యమైతే మామ స్వాతి ముత్యమని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ సమ్మెపై టీఆర్ఎస్ నేతలు డబుల్ గేమ్ ఆడుతున్నారని ఆయన విమర్శించారు. ఉద్యోగ సంఘాలను రెచ్చగొట్టి సమ్మెకు పురికొల్పేది ప్రభుత్వానికి చెందిన కార్మిక సంఘమేనని, మరోవైపు డిమాండ్లు అంగీకరించేది లేదని చెప్పేది కూడా ప్రభుత్వమేనని, ఆర్టీసీ కార్మికులతో తెలంగాణ ప్రభుత్వం డబుల్ గేమ్ ఆడుతోందని ఆయన మండిపడ్డారు.