: వెంకయ్యనాయుడును ఆంధ్రాకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు: కామినేని
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడును ఆంధ్రప్రదేశ్ కు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కామినేని శ్రీనివాస్ ఆరోపించారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకులు, కమ్యూనిస్టులు కలిసి వెంకయ్యనాయుడును రాష్ట్రానికి దూరం చేయాలని కుట్ర పన్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో సేవలు చేసిన ఆయనను ఆంధ్రప్రదేశ్ కు దూరం చేసే ప్రయత్నాలు చేయవద్దని ఆయన సూచించారు. దారీ తెన్నూ లేని రాష్ట్రానికి నిధులు రావాలంటే ఆయన సేవలు చాలా అవసరమని రాజకీయ పక్షాలు గుర్తించాలని ఆయన సూచించారు.