: మా పెళ్లి కోసమే ఆయన సినిమా నిర్మించినట్టున్నారు: నీతూ అగర్వాల్


మా ఇద్దరి వివాహం కోసమే ఆయన సినిమా నిర్మించినట్టున్నారని సినీ నటి నీతూ అగర్వాల్ అభిప్రాయపడింది. ఎర్రచందనం స్మగ్లర్లకు సహకరించిన కేసులో బెయిల్ పై విడుదలైన నీతూ అగర్వాల్ మీడియాతో పలు విశేషాలు పంచుకుంది. తనకు చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలని, పెద్ద హీరోయిన్ అవ్వాలని కోరికని చెప్పింది. అందులో భాగంగానే తాను మస్తాన్ వలీని కలిశానని చెప్పింది. షూటింగ్ జరుగుతుండగా ప్రేమలో పడ్డామని, ప్రేమించిన కారణంగా ఆయన గురించి ఏమీ తెలుసుకోలేదని నీతూ వెల్లడించింది. తనకు నెమ్మదిగా నిజాలు తెలియడంతో నిలదీశానని, ఎదురు తిరుగుతానని భావించి తన ఏటీఎం కార్డు తీసుకుని తనను ఇరికించాడని నీతూ అగర్వాల్ చెప్పింది.

  • Loading...

More Telugu News