: నకిలీ పత్రాలతో డాక్టర్ల వివాహయత్నం... తిరుమలలో ప్రేమ జంట గుట్టు రట్టు
వారిద్దరూ డాక్టర్లు. ప్రేమించుకున్నారు. తిరుమలలో దేవదేవుడి సన్నిధిలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొని వచ్చారు. అధికారులకు తప్పుడు ధ్రువపత్రాలు ఇచ్చి అడ్డంగా దొరికిపోయారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన డాక్టర్లు సబిత, అనిల్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. విషయాన్ని పెద్దలకు తెలుపగా, వీరి ప్రేమను రెండు కుటుంబాలూ వ్యతిరేకించాయి. దీంతో వివాహం చేసుకోవాలని ఈ ఉదయం తిరుమలకు చేరుకున్నారు. అందుకోసం తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించారు. సబిత, అనిల్ ల వివాహం జరుగుతున్న సమయంలో సబిత తల్లిదండ్రులు తిరుమలకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తప్పుడు ధ్రువపత్రాల విషయం వెలుగులోకి వచ్చి పెళ్లి పంచాయితీ పోలీసుల ముందుకెళ్లింది.