: 90 రోజుల్లో జగన్ కు భారీ షాక్...వైసీపీలో పెను ప్రకంపనలే: వర్ల రామయ్య జోస్యం
ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ త్వరలో భారీ కుదుపులకు గురి కానుందట. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పెద్ద షాక్ తప్పదని టీడీపీ నేత వర్ల రామయ్య జోస్యం చెప్పారు. నిన్న టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో విలేకరులతో మాట్లాడిన సందర్భంగా రామయ్య ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కు తగలనున్న భారీ షాక్ తో ఆయన ఆర్థిక భాగస్వాముల్లోనూ ప్రకంపనలు తప్పవని రామయ్య చెప్పుకొచ్చారు. వైసీపీలో పెను ప్రకంపనలు వచ్చే రోజున జగన్ మొరను ఆలకించే నాథుడే ఉండరని ఆయన ఆన్నారు. నిత్యం నేరస్థులతో ఉంటూ, కోర్టు మెట్లు ఎక్కి దిగే జగన్ కు ప్రజల్లో తిరిగే నైతిక హక్కు లేదని రామయ్య తేల్చిపారేశారు. మరి 90 రోజుల్లో జరిగే ఆ పెను పరిణామాలేవో మాత్రం రామయ్య చెప్పలేదు.