: 168 మంది ఆర్టీసీ కార్మికుల అరెస్ట్... పరిస్థితి ఉద్రిక్తం


ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల సమ్మె పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. సమ్మెలో భాగంగా, ఈ ఉదయం కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు. బస్సులు డిపోను దాటి బయటకు రాకుండా అడ్డుకున్నారు. ప్రైవేట్ వ్యక్తులతో ఆర్టీసీ యాజమాన్యం బస్సులను నడపకుండా చూసేందుకు... బస్సు టైర్లలో గాలి తీసేశారు. దీంతో, పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళన చేస్తున్న 168 మంది కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో డిపో ముందు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు, అనంతపురం జిల్లా గుంతకల్లు ఆర్టీసీ డిపో దగ్గర కూడా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ప్రైవేటు సిబ్బంది సహాయంతో నాలుగు బస్సులను డిపో నుంచి బయటకు తీశారు. దీంతో, ఆర్టీసీ కార్మికులు ప్రైవేటు డ్రైవర్లతో వాగ్వాదానికి దిగడంతోపాటు, వారిపై దాడికి కూడా యత్నించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆర్టీసీ కార్మికులను చెదరగొట్టేందుకు యత్నించారు. ఈ క్రమంలో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

  • Loading...

More Telugu News