: అంత ఫిట్ మెంట్ ఇస్తే ఆర్టీసీ సంస్థను మూయాల్సిందే: మంత్రి మహేందర్ రెడ్డి


తాము అడిగినంత ఫిట్ మెంట్ ఇవ్వాల్సిందేనంటూ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయడంపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి స్పందించారు. కార్మికులు అడుగుతున్న 43 శాతం ఫిట్ మెంట్ ఇస్తే సంస్థ మూసుకోవాల్సిందేనన్నారు. అసలే సంస్థ నష్టాల్లో ఉందని కార్మికులకు తెలుసునని, ఇలాంటి సమయంలో సిబ్బంది సహకరించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘం వేస్తామన్నప్పటికీ సమ్మెకు దిగారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం వారి సమస్యలు పట్ల సానుకూలంగా ఉన్నారన్న మంత్రి, కొత్త రాష్ట్రం కాబట్టి కొంచెం సమయం ఇస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News