: పశ్చిమ బెంగాల్ లో బాణసంచా తయారీలో పేలుడు... పది మంది మృతి
పశ్చిమ బెంగాల్ లో కొద్దిసేపటి క్రితం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మిడ్నాపూర్ లో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ పేలుడులో 10 మంది కార్మికులు అక్కడికక్కడే మరణించారు. మరికొంత మంది తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. దీంతో ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని వైద్య వర్గాలు తెలిపాయి.