: ప్రత్యేకహోదా ఇచ్చి నిధులు ఇవ్వకపోతే లాభం లేదు: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చి నిధులు ఇవ్వకపోతే లాభం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. విజయనగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి ప్రజలు సహకరించాలని కోరారు. భూసేకరణ ద్వారా ఎయిర్ పోర్టు భూమి తీసుకోవాలా? లేక భూ సమీకరణ ద్వారా తీసుకోవాలా? అనేది రైతులతో చర్చించి నిర్ణయిస్తామని ఆయన అన్నారు. కేంద్రం హోదా ఇచ్చి నిధులు ఇవ్వకపోతే లాభం లేదని, నిధులు ఇవ్వాల్సింది కేంద్రమేనని ఆయన స్పష్టం చేశారు.