: దావూద్ ఎక్కడున్నాడో చెప్పాల్సిందేనని పట్టుబట్టిన గులాం నబీ అజాద్
అండర్ వరల్డ్ డాన్, ముంబై బాంబు పేలుళ్ల నిందితుడు దావూద్ ఇబ్రహీం ఎక్కడున్నాడో చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ గులాం నబీ అజాద్ పట్టుబట్టారు. తనకు సమాధానం చెప్పాల్సిందేనని రాజ్యసభలో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. నిన్న లోక్ సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్ పార్తీభాయ్ చౌధురి మాట్లాడుతూ, దావూద్ ఎక్కడున్నాడో తమకు తెలియదని చెప్పడం సంచలనం రేకెత్తించడం తెలిసిందే.