: బెజవాడ కనకదుర్గమ్మ దర్శన వేళల పెంపు


విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దర్శన వేళలను పెంచుతూ దేవస్థానం నిర్ణయం తీసుకుంది. సాధారణంగా రాత్రి 9 గంటల వరకే అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. ఇకపై శుక్ర, ఆదివారాల్లో తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనభాగ్యం లభించనుంది. అమరావతిని రాష్ట్ర రాజధాని ప్రాంతంగా ప్రకటించడంతో... అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. శుక్ర, ఆదివారాల్లో 40 నుంచి 50 వేల మంది భక్తులు కూడా వస్తున్నారు. ఈ నేపథ్యంలో, దర్శన వేళలను పెంచారు.

  • Loading...

More Telugu News