: సల్మాన్ కు రెండు రోజుల తాత్కాలిక బెయిల్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు బాంబే హైకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. రెండు రోజుల వరకు అంటే ఎల్లుండి వరకు కోర్టు బెయిల్ ఇచ్చింది. బాంబే సెషన్స్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన వెంటనే సల్మాన్ న్యాయవాది, కుటుంబ సభ్యులు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో బెయిల్ విషయంలో సల్మాన్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. సెషన్స్ కోర్టు తీర్పు ప్రతి అందనందున హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించింది. తదుపరి విచారణ అదే రోజుకు వాయిదా పడింది.