: ఢిల్లీ జూకి చేరిన 14 అడుగుల తాచుపాము
దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న జంతు ప్రదర్శనశాల (జూ)లో తాచుపాము వచ్చి చేరింది. ఇది ఆషామాషీ తాచు కాదు... ఏకంగా 14 అడుగుల పొడవు ఉంది. ఈ విషయాన్ని జూ అధికారి పన్నీర్ సెల్వం వెల్లడించారు. దాని బరువు 7 కేజీలు ఉంది. ప్రస్తుతం ఆ తాచును పరిశీలనలో ఉంచామని... కొద్ది రోజుల అనంతరం ప్రజలు చూసేందుకు వీలుగా ప్రదర్శనకు ఉంచుతామని సెల్వం చెప్పారు. ఈ అరుదైన తాచును రాజస్థాన్ అటవీ అధికారులు ఇచ్చారని తెలిపారు.