: కోర్టు హాలు నుంచి వెళ్లిపోయిన సల్మాన్ సోదరులు... పోలీసుల అదుపులో సల్లూ భాయ్
కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు 'హిట్ అండ్ రన్' కేసులో శిక్ష ఖాయం కావడంతో ఆయన సోదరులు ఆర్భాజ్ ఖాన్, సోహైల్ ఖాన్ లు కోర్టు హాలు నుంచి కంటతడి పెడుతూ బయటకు వెళ్లిపోయారు. తన కొడుకును దోషిగా తేల్చిన తరువాత ఆయన తల్లి సైతం కన్నీటిపర్యంతం అయ్యారు. కోర్టు నుంచి బయటకు వచ్చిన సల్మాన్ సోదరులను మాట్లాడాలని మీడియా కోరినప్పటికీ, వారు స్పందించలేదు. దోషిగా నిర్ధారణ కావడంతో ప్రస్తుతం సల్మాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శిక్షా కాలాన్ని నిర్ధారించిన వెంటనే ఆయనను ఆర్థర్ రోడ్ జైలుకు తరలించే ఏర్పాట్లు కూడా పూర్తయినట్టు సమాచారం. కాగా, మూడేళ్ల లోపు శిక్ష పడితే, అక్కడికక్కడే బెయిలు లభించే అవకాశముంది. ఒకవేళ అంతకన్నా ఎక్కువ శిక్ష పడితే మాత్రం హైకోర్టును ఆశ్రయించాల్సిందే. ఒకవేళ ఆ పరిస్థితే వస్తే మధ్యాహ్నమే బెయిలు పిటిషన్ వేయాలని సల్మాన్ న్యాయవాదులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శుక్రవారం నుంచి బాంబే హైకోర్టుకు వేసవి సెలవులు ఉండడంతో ఈ లోగానే సల్మాన్ కు బెయిలు లభించేలా చూడాలన్నది వారి ఆలోచనగా తెలుస్తోంది.