: కోర్టు హాలులో కంటతడిపెట్టిన కండల వీరుడు!


బాలీవుడ్ లో పటిష్ఠమైన దేహదారుఢ్యం ఉన్న హీరో ఎవరంటే, ఠక్కున సల్మాన్ ఖాన్ అనే చెప్పేస్తాం. ఇటీవలి కాలంలో హిట్ చిత్రాల హీరోగా మారిన అతడు, ఆయా సినిమాల్లో విలన్లను ఇరగదీసి ఏడిపిస్తాడు. అయితే నిజ జీవితంలో సీన్ రివర్సైంది. హిట్ అండ్ రన్ కేసులో సెషన్స్ కోర్టు సల్మాన్ ను దోషిగా తేల్చింది. తీర్పు వెలువరుస్తున్న సందర్భంగా న్యాయమూర్తి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘నాడు కారు నడుపుతున్న సమయంలో మందు తాగి ఉన్నారు. డ్రైవర్ కారును డ్రైవ్ చేశాడంటూ కోర్టును తప్పుదోవ పట్టించేందుకు యత్నించారు’’ అంటూ న్యాయమూర్తి సల్మాన్ ను మందలించారు. అనంతరం, సల్మాన్ ను జడ్జి దోషిగా ప్రకటించారు. దీంతో కోర్టు హాలులోనే అతడు బోరున విలపించాడు. కోర్టు జడ్జిమెంటుతో సల్మాన్ కుటుంబం మొత్తం కన్నీటిపర్యంతమయింది.

  • Loading...

More Telugu News