: భారత నిపుణుల విషయంలో ఆంక్షలు సరికాదు: చిదంబరం


భారత ఐటి నిపుణులను వలసదారుల్లా చూడొద్దని ఆర్థిక మంత్రి చిదంబరం అమెరికాకు విజ్ఞప్తి చేశారు. శనివారం వాషింగ్టన్ లో జరిగిన ప్రపంచబ్యాంక్ వార్షిక సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మన దేశ ఆందోళనను అమెరికా ప్రభుత్వానికి తెలియపరిచారు. హెచ్1బి వీసాల ఫీజు పెంపు వివక్షాపూరితంగా ఉందన్నారు. వలసవాద సంస్కరణల బిల్లులో హెచ్1బి వీసాల నిబంధనలను కఠినతరం చేయడంపై ఆందోళనను అమెరికా ఆర్థిక మంత్రి జాక్ ల్యూ దృష్టికి తీసుకెళ్లారు. అధికంగా హెచ్1బి ఉద్యోగులను కలిగున్న భారతీయ ఐటి కంపెనీలపై అధిక ఫీజులు చెల్లించేలా సెనేటర్ల ద్వైపాక్షిక బృందం వలసవాద సంస్కరణల బిల్లులో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News