: సల్మాన్ ను కలిసిన షారూఖ్...అండగా ఉంటానని చెప్పిన బాద్షా


మరికొద్ది గంటల్లో 'హిట్ అండ్ రన్' కేసులో కండలవీరుడు సల్మాన్ ఖాన్ పై కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో ఆయన ఇంటికి బాలీవుడ్ క్యూ కట్టింది. ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు ముంబైలోని గెలాక్సీ అపార్ట్ మెంట్ కు వెళ్లి సల్మాన్ ను పరామర్శించారు. వీరిలో బాలీవుడ్ బాద్షా పారూఖ్ కూడా ఉన్నారు. తామంతా అండగా ఉంటామని, నీకు మేలు కలుగుతుందని ఈ సందర్భంగా షారూఖ్ వ్యాఖ్యానించినట్టు సమాచారం. సుమారు ఆరేళ్ల తరువాత వీరిద్దరూ అత్యంత సన్నిహితంగా కనిపించారని తెలుస్తోంది. 2008లో కత్రినా కైఫ్ పుట్టినరోజు వేడుకల్లో గొడవ జరిగిన తరువాత వీరిద్దరి మధ్యా దూరం పెరిగిన సంగతి తెలిసిందే. ఆ మధ్య సల్మాన్ సోదరి అర్పిత వివాహం తదితర సందర్భాల్లో వీరు కలిసినా, కాస్తంత అంటీముట్టనట్టుగానే కనిపించిన సంగతి తెలిసిందే. కాగా, సల్మాన్ ఇంటికి అర్పిత తన భర్త ఆయుష్ తో కలిసి రాగా, మరో సోదరి అల్విరా, సోదరుడు సొహాయిల్ తదితరులు కూడా పరామర్శించారు.

  • Loading...

More Telugu News