: ‘ఎర్ర’ హీరోయిన్ నీతూ అగర్వాల్ రిలీజ్... ఉదయం 6 గంటలకే జైలు నుంచి విడుదల
ఎర్రచందనం అక్రమ రవాణాలో ప్రమేయమున్న కారణంగా అరెస్టైన టాలీవుడ్ హీరోయిన్ నీతూ అగర్వాల్ నేటి ఉదయం జైలు నుంచి విడుదలైంది. బెయిల్ కోసం ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. షరతులతో కూడిన బెయిల్ ను నిన్ననే మంజూరు చేసింది. దీంతో కోర్టు పేపర్లు అందుకున్న నంద్యాల సబ్ జైలు అధికారులు నేటి ఉదయం 6 గంటలకు గుట్టుచప్పుడు కాకుండా ఆమెను విడుదల చేశారు. వైసీపీ నేత, చాగలమర్రి ఎంపీపీ మస్తాన్ వలీని పెళ్లి చేసుకున్న నీతూ అగర్వాల్, అతడి ఒత్తిడి మేరకే ఎర్ర స్మగ్లర్లకు తన బ్యాంకు ఖాతా ద్వారా డబ్బు పంపినట్టు విచారణలో తెలిపింది.