: కొండచిలువ గుడ్లు ఆర్డరిచ్చి కటకటాలపాలైన యువకుడు


ఆన్ లైన్ బిజినెస్ విశ్వవ్యాప్తంగా విస్తృతమవుతుండడంతో ఏ వస్తువు కావాలన్నా దానిని వెంటనే కాళ్లదగ్గరకు తెప్పించుకుంటున్నారు. తాజాగా, చైనాకు చెందిన ఓ యువకుడు ఏకంగా కొండచిలువ గుడ్లు ఆర్డరిచ్చి ఇబ్బందులు కొనితెచ్చుకున్నాడు. ఇంటర్నెట్ లో ఆన్ లైన్ లో 9 కొండచిలువ గుడ్లకు ఆర్డరిచ్చాడు. వారం రోజుల్లో అవి కొరియర్ లో వచ్చేశాయి. వాటిని ఇంక్యుబేటర్ లో పెట్టడంతో వాటి నుంచి తొమ్మిది కొండచిలువ పిల్లలు వచ్చేశాయి. వాటి ఫోటోలు తీసి 'మా ఇంట్లో కొండచిలువ పిల్లలు పుట్టాయోచ్' అంటూ ఫోటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. ఇది ఆ నోటా, ఈ నోటా పడి పోలీసుల వద్దకు వెళ్లింది. దీంతో విదేశాల నుంచి అక్రమంగా గుడ్లు తెప్పించాడన్న ఆరోపణలతో అతడిని అరెస్టు చేశారు. 30 సెంటీ మీటర్ల పొడవున్న 9 కొండచిలువ పిల్లలను స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News