: ఫ్యాక్షనిస్టు చనిపోతే సీబీఐ విచారణ వేయాలా?: సోమిరెడ్డి


అనంతపురం జిల్లాలో వైసీపీ నేత ప్రసాదరెడ్డి హత్యకు గురికాగా, దానిపై జగన్ సీబీఐ విచారణ కోరడాన్ని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తప్పుబట్టారు. సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న జగన్ ఓ ఫ్యాక్షనిస్టు హత్యపై సీబీఐ విచారణ కోరడం ఏమిటని అన్నారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ... అయినా, ఓ ఫ్యాక్షనిస్టు చనిపోతే సీబీఐ విచారణ వేయాలా? అని ప్రశ్నించారు. జగన్ వైఖరే అంత అని, పరిటాల రవి హత్య కేసులో నిందితుడు పులివెందుల కృష్ణకు జగన్ సాయం చేశాడని సోమిరెడ్డి ఆరోపించారు. టీడీపీ రాజకీయ హత్యలకు పాల్పడుతోందంటూ జగన్ గవర్నర్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News