: ఆ హోటల్ కు వెళితే జైలుకి వెళ్లినట్టే!


లాత్వియాలోని లీపజా సిటీలో ఉండే కరోస్టా హోటల్ కు ఓ ప్రత్యేకత ఉంది. ఈ హోటల్ గతంలో ఓ జైలు. దాన్ని హోటల్ గా మార్చినా, జైలు సంప్రదాయాలనే పాటిస్తుంటారు. కస్టమర్లు రాగానే చేతులకు బేడీలు వేస్తారు... ఖైదీల్లా! గదులు కూడా జైలు గదులను తలపిస్తాయి. ఆహారం అందించే ప్లేట్లు, భారీ తలుపులు, ఊచలు... ఇలా, అన్నీ జైలు జీవితాన్ని అనుభవంలోకి తెస్తాయి. సిబ్బంది పోలీసు డ్రెస్సుల్లో కనిపిస్తారు. అంతేగాదు, తుపాకీ మడమలతో కస్టమర్లను గదుల్లోపలికి నెడతారు. ఇక, కస్టమర్ల వినోదం కోసం 'ఎస్కేప్ ఫ్రం రష్యా' అనే ఆట కూడా ఉంటుంది. ఈ తరహా ట్రీట్ మెంట్ తమకు సమ్మతమేనంటూ హోటల్ గది బుక్ చేసుకునే సమయంలో సంతకం చేయాల్సి ఉంటుంది. ఇంత వైరైటీ చూపిస్తున్న ఈ హోటల్ కు టూరిస్టుల తాకిడి ఎక్కువేనట.

  • Loading...

More Telugu News