: విద్యాబాలన్ చెంప చెళ్లుమనిపించిన 'సినిమా' భర్త
నిజమే, విద్యాబాలన్ చెంప చెళ్లుమనిపించాడామె భర్త. అయితే, నిజజీవితంలో కాదు లెండి. ఇదొక సినిమా షూటింగ్ తమాషా. 'గృహహింస'పై 'హమారీ అధూరీ కహానీ' అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో రాజ్ కుమార్ రావ్, విద్యాబాలన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో గృహహింసపై చర్చిస్తున్నారు. దీంతో సన్నివేశంలో భాగంగా విద్యాబాలన్ చెంపపై ఆమె సినిమా భర్త మూడుసార్లు కొట్టాడట. జూన్ 12న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్ లో ఈ విషయాన్ని రాజ్ కుమార్ రావ్ వెల్లడించాడు.