: 43 శాతం అడిగితే 27 ఇస్తామన్నారు... సమ్మె బాట తప్పట్లేదు: ఆర్టీసీ కార్మిక సంఘాలు


ఆర్టీసీ కార్మికులు సమ్మెకే జైకొట్టారు. ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ఇచ్చిన మాదిరిగా తమకూ 43 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని కోరితే, 27 శాతానికి యాజమాన్యం ప్రతిపాదించిందని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ నేతలు చెప్పారు. తాము అడిగిన దానికి, యాజమాన్యం చెప్పిన దానికి పొంతన లేని కారణంగా సమావేశం నుంచి బయటకొచ్చేశామని వారు తెలిపారు. అంతేకాక ఫిట్ మెంట్ మినహా ఇతర డిమాండ్ల పరిష్కారంపై యాజమాన్యం నాన్చుడు ధోరణి అవలంబిస్తోందని వారు ఆరోపించారు. మంత్రివర్గ ఉప సంఘం నివేదిక పేరు చెప్పి ఇన్ని రోజులు కాలయాపన చేసిన యాజమాన్యం మరింత కాలం తమను మోసం చేసేందుకే సిద్ధంగా ఉన్నట్లు కనిపించిందని, అందుకే సమ్మె బాట పట్టక తప్పడం లేదని పేర్కొన్నారు. కార్మిక సంఘాల నిర్ణయంతో రెండు రాష్ట్రాల్లో నేటి అర్ధరాత్రి నుంచి బస్సు సర్వీసులు నిలిచిపోనున్నాయి.

  • Loading...

More Telugu News