: ‘విభజన’పై హైకోర్టు తీర్పు పరిశీలన తర్వాత నిర్ణయం: కేంద్ర మంత్రి సదానంద గౌడ
తెలుగు రాష్ట్రాల మధ్య నానాటికీ ఉద్రిక్తతలకు దారితీస్తున్న హైకోర్టు విభజనపై కేంద్రం స్పందించింది. రాష్ట్ర విభజన జరిగిన మాదిరిగానే హైకోర్టునూ తక్షణమే విభజించాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ వెలుపలా, లోపలా నేడు ఆందోళనలకు దిగారు. సభలో స్పీకర్ పోడియం వద్ద చేరి నినాదాలతో హోరెత్తించారు. దీంతో స్పందించిన కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ ఈ విషయంపై సభలో విస్పష్ట ప్రకటన చేశారు. హైకోర్టు విభజనకు సంబంధించిన ఇటీవల ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని పరిశీలించిన తర్వాత తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.