: సీఎం చంద్రబాబును కలసిన కడియం శ్రీహరి
ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును ఈరోజు తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కలిశారు. వరంగల్ లో ని రేయాన్స్ పరిశ్రమ అంశంపై చర్చించారు. ఈ భేటీలో తెలంగాణ మంత్రి చందూలాల్, ఎంపీలు గరికపాటి, సీతారామ్ నాయక్ లు కూడా ఉన్నారు. భేటీ ముగిసిన అనంతరం కడియం మీడియాతో మాట్లాడుతూ, ముడిసరుకు లేక వరంగల్ రేయాన్స్ ఫ్యాక్టరీ మూతపడిందని, ఏపీ నుంచి ముడిసరుకు సరఫరా చేస్తే రేయాన్స్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. ఇందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారని, త్వరలోనే తమ నిర్ణయం చెబుతామన్నారని కడియం తెలిపారు.