: పవన్ కల్యాణ్ శక్తి అనంతం... ఆయన వెనకే నేను... అన్నింటికీ తెగించే ఉన్నాను: నటుడు శివాజీ


పవన్ కల్యాణ్ శక్తి అనంతమని, ప్రత్యేక హోదా కోసం ఆయన ముందు నిలిస్తే ఆయన వెనుకే తాను నడుస్తానని నిరాహార దీక్ష చేస్తున్న నటుడు శివాజీ అన్నారు. ఈ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పవన్ కదలిరావాలని ఆయన కోరారు. హోదా విషయంలో తనకు వస్తున్న ప్రజా మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. బీహార్ లో ఎన్నికలు ఉన్నందునే ఆ రాష్ట్రానికి లక్ష కోట్ల రూపాయలు కేటాయించారని అన్నారు. పార్లమెంటులో ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు, పదిహేనేళ్లు కావాలని కోరిన వెంకయ్యనాయుడు ఇప్పుడేమయ్యారని ప్రశ్నించారు. రాష్ట్రానికి రూ. 10 వేల కోట్లు ఇచ్చారని గుండెలపై చెయ్యేసుకుని చెప్పాలని సుజనా చౌదరికి సవాల్ విసిరారు. టీడీపీ కూడా హోదా కోసం గట్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. తాను అన్నింటికీ తెగించే వచ్చానని, హోదా వచ్చేదాకా విశ్రమించనని శివాజీ అన్నారు.

  • Loading...

More Telugu News