: బాకీ తీర్చలేదని కొడుకు, కూతుర్ని కిడ్నాప్ చేసిన వడ్డీ వ్యాపారి


ఎన్ని చర్యలు తీసుకున్నా వడ్డీ వ్యాపారుల ఆగడాలు ఆగడం లేదు. బాకీ తీర్చలేదని అప్పు తీసుకున్న వ్యక్తి కుమారుడు, కుమార్తెను కిడ్నాప్ చేసిన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. మెదక్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... గాదిరెడ్డిపల్లికి చెందిన స్వామి అనే వ్యక్తి నిజామాబాద్ కు చెందిన ఓ వడ్డీ వ్యాపారి వద్దనుంచి కొంత మొత్తం అప్పుగా తీసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ అప్పును తీర్చలేకపోయాడు. దీంతో ఆ వడ్డీ వ్యాపారి స్వామి కొడుకు, కూతుర్ని కిడ్నాప్ చేశాడు. దీంతో స్వామి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News