: లఖ్వీ అమాయకుడు... 26/11 దాడులతో సంబంధంలేదు: హఫీజ్ సయీద్


లష్కరే తోయిబా ఉగ్రనేత జకీయుర్ రహ్మాన్ లఖ్వీ అమాయకుడని, కరుడుగట్టిన ఛాందసవాది, నిషిద్ధ జమాత్-ఉద్-దవా చీఫ్ హఫీజ్ సయీద్ అంటున్నాడు. 26/11 ముంబయి దాడులతో అతనికి సంబంధం లేదని తెలిపాడు. లఖ్వీకి వ్యతిరేకంగా భారత్ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని అన్నాడు. నిరాశలో కూరుకుపోయిన భారత్ ఐక్యరాజ్యసమితిని, అమెరికాను సంప్రదించి లఖ్వీని శిక్షించాలంటూ పాకిస్థాన్ సర్కారుపై ఒత్తిడి పెంచాలని భావిస్తోందని తెలిపాడు. భారత్, ఐరాసకు పాక్ న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకునే హక్కు లేదని హఫీజ్ స్పష్టం చేశాడు. గతంలోను పాకిస్తాన్ కోర్టులు వెలువరించిన తీర్పులను భారత్ అంగీకరించలేదని తెలిపాడు.

  • Loading...

More Telugu News