: ఫ్రాన్స్ లో అలరించిన ఐరన్ మ్యాన్ 70.3
ఫ్రాన్స్ లో ఐరన్ మ్యాన్ 70.3 పోటీలు రక్తికట్టించాయి. ట్రెత్లన్ కార్పొరేషన్ నిర్వహించే ఈ ట్రెత్లన్ పోటీల్లో విజేతను ఐరన్ మ్యాన్ గా పిలుస్తారు. ఈ పోటీల్లో 70.3 మైళ్ల దూరంలోని గమ్యాన్ని నిర్వాహకులు నిర్దేశించిన విధంగా చేరితే సరిపోతుంది. ఇందులో 12 మైళ్ల దూరం నీటిలో ఈదుకుంటూ, 56 మైళ్ల దూరం సైకిల్ తొక్కుతూ, 13.1 మైళ్ల దూరం పరుగెత్తుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన ఔత్సాహికులు ఈ పోటీలో విజేతగా నిలిచేందుకు ఉత్సాహం చూపుతారని నిర్వాహకులు తెలిపారు. కాగా, ఈ ఏడాది కూడా పోటీలకు మంచి ఆదరణ లభించిందని వారు పేర్కొంటున్నారు.