: రైనా, డు ప్లెసిస్ వికెట్లు కోల్పోయిన చెన్నై


రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ 15 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. ఓపెనర్ డ్వేన్ స్మిత్ డకౌట్ కాగా, మరో ఓపెనర్ మెక్ కల్లమ్ 20 పరుగులు చేసి వీజ్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. ఓపెనర్లు అవుట్ కావడంతో చెన్నై స్కోరు మందగించింది. ఆ తర్వాత రైనా, ఫాప్ డు ప్లెసిస్ క్రీజులో నిలదొక్కుకున్న తర్వాత స్కోరు బోర్డు ఊపందుకుంది. అయితే, డు ప్లెసిస్ 24 పరుగులు చేసి అవుటవగా, ఫిఫ్టీ అనంతరం రైనా (52) కూడా వెనుదిరిగాడు.ఇక, క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ధోనీ దూకుడైన ఆటతీరుకు ప్రాధాన్యమిచ్చాడు. ఇక్బాల్ అబ్దుల్లా బౌలింగ్ లో ఓ సిక్స్, ఫోర్ బాది తన ఉద్దేశాన్ని చాటాడు.

  • Loading...

More Telugu News