: డీజీపీని టీడీపీ నేతలు 'అన్నా', 'మామా' అని పిలుస్తారు: ఏపీ డీజీపీపై జగన్ విసుర్లు


ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాముడుపై వైకాపా అధినేత జగన్ పలు ఆరోపణలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ నేతలతో సత్సంబంధాలను కలిగి ఉన్న డీజీపీ... ఆ పార్టీ నేతలు చేస్తున్న అరాచకాలకు సహకరిస్తున్నారని ఆరోపించారు. ఆయన సొంత జిల్లా అనంతపురంలోనే హత్యలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. డీజీపీని టీడీపీ నేతలు... అన్నా, మామా అంటూ పిలుస్తారని అన్నారు. ప్రసాద్ రెడ్డి హత్య విషయంలో స్థానిక ఎస్ఐని వీఆర్ కు వేస్తే, మరుసటి రోజే తిరిగి పోస్టింగ్ ఇచ్చారని మండిపడ్డారు. రెండు నెలల్లో రిటైర్ కావాల్సిన డీజీపీ రాముడుకి రెండేళ్ల సర్వీస్ పొడిగించారని విమర్శించారు.

  • Loading...

More Telugu News