: మరో కేసులో డెక్కన్ క్రానికల్ వెంకట్రామిరెడ్డి అరెస్ట్


డెక్కన్ క్రానికల్ పత్రిక అధినేత టి.వెంకట్రామిరెడ్డి మరో కేసులో ఇరుక్కున్నారు. మునీష్ మక్కడ్ అనే వ్యక్తి ఇంటికి వెళ్లి, ఆయనపై దౌర్జన్యం చేశారన్నది వెంకట్రామిరెడ్డిపై ఉన్న అభియోగం. ఈ కేసులో ఢిల్లీలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, వెంకట్రామిరెడ్డి తన అనుచరులతో కలసి వెళ్లి మక్కడ్ ను చితకబాదారని, తుపాకి మడమతో కూడా కొట్టారని తమకు ఫిర్యాదు అందినట్టు వెల్లడించారు. ఈ క్రమంలో వెంకట్రామిరెడ్డిని పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. అంతేకాకుండా, మూడు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరామని చెప్పారు.

  • Loading...

More Telugu News