: 'అక్రమ సంబంధం'పై ఆప్ నేత కుమార్ విశ్వాస్ కు మహిళా కమిషన్ నోటీసులు
ఆమ్ ఆద్మీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ నేత కుమార్ విశ్వాస్ 'అక్రమ సంబంధం' నడుపుతున్నాడంటూ, వివరణ ఇవ్వాల్సిందిగా ఢిల్లీ మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. విశ్వాస్ కు తనతో సంబంధముందని వచ్చిన ఆరోపణలపై ఆయన నోరు మెదపడం లేదని ఆప్ పార్టీలోని ఓ మహిళా కార్యకర్త ఆరోపించారు. తాను ఫిర్యాదు చేసినా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించలేదని అన్నారు. ఈ తరహా ఆరోపణలు పెరగడంతో తన భర్త వదిలేసి వెళ్లాడని తెలిపారు. ఈ ఆరోపణలను విశ్వాస్ కనీసం ఖండించడం కూడా లేదని ఆరోపించారు. కాగా, ఆ యువతి పోలీసు కమిషనర్ కు లేఖ రాసిందని ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు బర్కా శుక్లా సింగ్ తెలిపారు. అందువల్లే కుమార్ విశ్వాస్, ఆయన భార్యకు నోటీసులు పంపి మంగళవారం కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించినట్టు వివరించారు. ఇదిలావుండగా, ఆరోపణలపై కుమార్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ 'హ హ హ, చేతగాక నీచత్వాన్ని నమ్ముకున్నారు' అన్నారు.