: బెజవాడకు వేలాది మంది అగ్రిగోల్డ్ బాధితులు... మరికాసేపట్లో భారీ నిరసన ర్యాలీ


అతి తక్కువ వ్యవధిలో అధిక రాబడులు ఇస్తామంటూ అమాయక జనాన్ని నిండా ముంచిన అగ్రిగోల్డ్ ఆగడాలు తెలుగు రాష్ట్రాలను దాటిపోయాయి. కర్ణాటక, తమిళనాడులోనూ అగ్రిగోల్డ్ చక్రం తిప్పింది. మొత్తం నాలుగు రాష్ట్రాల్లో లక్షలాది మందిని మాయ చేసి డిపాజిట్లు సేకరించిన అగ్రిగోల్డ్, ఇటీవల మెచ్యూరిటీ తీరిన బాండ్ల సొమ్ము చెల్లించడంలో విఫలమైంది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, ఆ సంస్థ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే నెలలు గడుస్తున్నా, సంస్థపై కఠిన చర్యలే లేవంటూ నాలుగు రాష్ట్రాల బాధితులు నేడు విజయవాడలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే విజయవాడ చేరుకున్న వేలాది మంది బాధితులు నగరంలో భారీ ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

  • Loading...

More Telugu News