: ప్రత్యేక హోదా వచ్చే దాకా దీక్ష విరమించేది లేదు: సినీ నటుడు శివాజీ
ఏపీకి ప్రత్యేక హోదా కోసం సినీ నటుడు, బీజేపీ నేత శివాజీ చేపట్టిన ఆమరణ దీక్ష రెండో రోజుకు చేరుకుంది. నిన్న గుంటూరులో ఆయన చేపట్టిన దీక్షకు మాల మహానాడు నేతలతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు సహా పలు ప్రజా సంఘాలు కూడా మద్దతు పలికాయి. అంతేకాక, రాత్రి కూడా ఆయనతో పాటే వారంతా దీక్షా శిబిరంలోనే నిద్రించారు. నేటి ఉదయం మీడియాతో మాట్లాడిన శివాజీ, ఏపీకి ప్రత్యేక హోదా దక్కేదాకా దీక్షను విరమించబోనని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే, శివాజీ దీక్షపై నిఘా పెట్టిన పోలీసులు ఆయన ఆరోగ్య పరిస్థితిపైనా ఆరా తీస్తున్నారు.