: కేంద్రం కొంచెం సాయం చేసుంటే ఎంతో ముందుకెళ్లేవాళ్లం: కేటీఆర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై మోదీ సర్కారు ఎంతో ఉదారంగా వ్యవహరిస్తోందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు అంటున్నారు. తెలంగాణకు రావాల్సిన ఐఏఎస్ అధికారుల వ్యవహారాన్ని తేల్చేందుకు కేంద్రం తొమ్మిది నెలలు తీసుకుందని, హైకోర్టు విభజన ఇంకా జరగనేలేదని, రాష్ట్ర ఉద్యోగుల విభజన ఇంకా పూర్తికానేలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కొంచమన్న సాయం చేసి ఉంటే ఈపాటికి, ఎంతో ముందుకు వెళ్లి ఉండేవాళ్లమని అభిప్రాయపడ్డారు. ఏపీకి మాత్రం కేంద్రం విశేషంగా సహాయం అందిస్తోందన్నారు. అయితే, అవశేష ఆంధ్రప్రదేశ్ ను తాము పోటీదారుగా పరిగణించడంలేదని, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పోటీ పడతామని ఉద్ఘాటించారు.