: బంజారాహిల్స్ లో మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి అరెస్టు


అనంతపురం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత గురునాథరెడ్డిని బంజారాహిల్స్ లోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు. వైసీపీ నేత ప్రసాదరెడ్డి హత్య అనంతరం హింసకు ప్రోత్సహించారంటూ గురునాథరెడ్డిపై ఆరోపణలున్నాయి. పలు కార్యాలయాలపై ఆయన దాడులకు పురిగొల్పారంటూ ఆయనను అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. గతవారం రాప్తాడులో ప్రసాదరెడ్డిని కొందరు దుండగులు హత్య చేయడం తెలిసిందే. అనంతరం, జిల్లాలో పలుచోట్ల అల్లర్లు చోటుచేసుకున్నాయి. కాగా, ఈ హత్య కేసులో పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్ పైనా ఆరోపణలు రావడం తెలిసిందే.

  • Loading...

More Telugu News