: స్పోర్ట్స్ మేనేజర్ చేయందుకోబోతున్న క్రికెటర్ రోహిత్ శర్మ
వరల్డ్ కప్ ముగిసిన తర్వాత టీమిండియా బ్రహ్మచారులు ఒక్కొక్కరుగా పెళ్లి బాట పడుతున్నారు. ఇటీవలే రైనా చిన్ననాటి స్నేహితురాలి చేయందుకోగా, తాజాగా, ముంబయి క్రికెటర్ రోహిత్ శర్మ ఓ ఇంటివాడవుతున్నాడు. రోహిత్ శర్మ స్పోర్ట్స్ మేనేజర్ రితికా సజ్దేను వివాహమాడనున్నాడు. ఆరేళ్లుగా వీరి మధ్య ప్రేమయాణం నడుస్తోంది. ఈ అమ్మడే రోహిత్ శర్మ క్రీడా ఒప్పందాలను పర్యవేక్షిస్తోందట. కాగా, రోహిత్ శర్మ దీనిపై ట్వీట్ చేయగా, మిత్రుడు యువరాజ్ సింగ్ స్పందించాడు. రోహిత్ కొత్త ఇన్నింగ్స్ నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపాడు.