: ఇదేం విధానం?... థర్డ్ ఏసీ కన్నా సెకండ్ ఏసీ రైలు ప్రయాణమే చౌక!


భారతీయ రైల్వేల్లో ఇటీవల ప్రవేశపెట్టిన 'డైనమిక్ ప్రైసింగ్' విధానం ఫెయిల్యూర్ దిశగా నడుస్తోంది. విమానయాన సంస్థలు అమలు పరిచే విధానాన్ని రైల్వేల్లో కూడా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అంటే ప్రయాణ సమయం దగ్గర పడేకొద్దీ డిమాండును బట్టి ధర మారిపోతూ ఉంటుంది. ఈ ధర తత్కాల్ టికెట్ ధరకు గరిష్ఠంగా రెండింతల వరకూ పెరగవచ్చు. ఈ డైనమిక్ ప్రైసింగ్ విధానం విఫలమైందని, చాలా రైళ్లలో సెకండ్ ఏసీ చార్జీతో పోలిస్తే థర్డ్ ఏసీ ప్రయాణం ఖరీదైందని విమర్శలు వస్తున్నాయి. ఉదాహరణకు మే 6వ తేదీ ప్రయాణానికి ముంబై- న్యూఢిల్లీ ప్రీమియం రైలులో థర్డ్ ఏసీ టిక్కెట్ ధర రూ. 3,634 రూపాయలుగా ఉండగా, సెకండ్ ఏసీ ధర రూ. 3,299 రూపాయలుగా ఉంది. ఇక మే 12న ప్రయాణానికి సీఎస్ టీ- పాట్నా ప్రీమియం రైలులో థర్డ్ ఏసీ టికెట్ ధర రూ. 6,369 ఉండగా, సెకండ్ ఏసీ టికెట్ రూ. 6,004కే లభిస్తోంది. అందుబాటులోని బెర్త్ ల సంఖ్య తగ్గేకొద్దీ ధరలు పెరుగుతుండటమన్న విధానం రైల్వేలకు లాభాలను తెచ్చిపెట్టినా, పై క్లాసులతో పోలిస్తే మరింత ధరలు కనిపిస్తుండడం ప్రయాణికులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.

  • Loading...

More Telugu News