: ఈ సన్మానం జరగాల్సింది మీకే!: బోయపాటి


'లెజెండ్' సినిమాను ఇంతగా ఆదరించిన అభిమానులకు ధన్యవాదాలని దర్శకుడు బోయపాటి శ్రీను తెలిపాడు. 'లెజెండ్' 400 రోజుల విజయోత్సవ వేడుకలో ఆయన మాట్లాడుతూ, ఈ సన్మానం జరగాల్సింది అభిమానులకని చెప్పాడు. సినిమాలో బాలయ్యబాబు నటన అద్భుతమని బోయపాటి తెలిపాడు. ప్రతి సన్నివేశమూ అభిమానులను అలరించేలా చేయడానికి బాలయ్యబాబు ఎక్కువ కష్టపడ్డారని ఆయన చెప్పాడు. అభిమానులు ఆయనను ఎప్పుడూ ఇలాగే ఆదరించాలని బోయపాటి ఆకాంక్షించాడు.

  • Loading...

More Telugu News