: రిటైర్డ్ ఉద్యోగులను మళ్లీ నియమించకూడదని నిర్ణయించిన టీఎస్ ప్రభుత్వం


తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్ అయిన ఉద్యోగులను ఓయస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)లుగా, కన్సల్టెంట్లుగా, సలహాదారులుగా కొనసాగించడం సాధారణంగా జరిగే తంతే. అయితే, ఇకపై ఇలాంటి నియామకాలు చేపట్టరాదంటూ టీఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి నియామకాలపై నిషేధం విధించింది. ఈ మేరకు ఈ రోజు ఉత్తర్వులు జారీ అయ్యాయి. రిటైర్డ్ ఉద్యోగులను ఆయా శాఖల్లో తిరిగి నియమించుకోరాదంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News