: చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ నా స్కూల్ నుంచి వచ్చినవారే: వీహెచ్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ లపై తెలంగాణ కాంగ్రెస్ సీనీయర్ నేత, ఎంపీ వి.హనుమంతరావు తనదైన శైలిలో కామెంట్ చేశారు. వీరిద్దరు కూడా తన స్కూలు నుంచే వచ్చారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అన్యాయం చేస్తూ, పారిశ్రామికవేత్తల కొమ్ముకాస్తున్నాయని ఆరోపించారు. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పారు. కొంతమంది నేతల వలసల వల్ల కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని వీహెచ్ అన్నారు.