: దావూద్ లొంగిపోతానన్నాడన్న విషయం అవాస్తవం... చీప్ పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నారు: మాజీ సీబీఐ చీఫ్ విజయరామారావు


అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ సీబీఐకి మూడు సార్లు ఫోన్ చేశాడని.. ఇదే విషయాన్ని అప్పటి సీబీఐ డైరెక్టర్ విజయరామారావుకు వివరించినా పట్టించుకోలేదని మాజీ డీఐజీ నీరజ్ కుమార్ చేసిన ప్రకటన సంచలనం రేపుతోంది. దీనిపై విజయరామారావు స్పందించారు. దావూద్ లొంగిపోవాలనుకుంటున్నాడన్న సమాచారం తనకు తెలియదని... కేవలం చీప్ పబ్లిసిటీ కోసమే నీరజ్ ఇదంతా చేస్తున్నారని అన్నారు. ఆయన వ్యాఖ్యలు అవాస్తవమని స్పష్టం చేశారు. సీబీఐ ఒక్కటే కాదు, దేశంలోని వివిధ దర్యాప్తు సంస్థలన్నీ దావూద్ కోసం గాలించాయని చెప్పారు. దావూద్ ను భారత్ కు పంపేందుకు అప్పట్లో పాకిస్థాన్ కూడా నిరాకరించిందని తెలిపారు.

  • Loading...

More Telugu News