: కదిరిలో క్రికెట్ బెట్టింగ్... పోలీసు దాడుల్లో ఏడుగురు బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్


క్రికెట్ బెట్టింగ్ పెద్ద నగరాల నుంచి చిన్నపాటి పట్టణాలకూ విస్తరిస్తోంది. ఐపీఎల్ పుణ్యమాని ఈ దుస్సంస్కృతి బలంగా వేళ్లూనుకుంటోంది. నేటి రాత్రి ఐపీఎల్-8లో భాగంగా హైదరాబాదులో తొలి మ్యాచ్ జరగనుంది. హైదరాబాదు సన్ రైజర్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. దీంతో క్రికెట్ అభిమానులు మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే అదనుగా బెట్టింగ్ రాయుళ్లు రంగంలోకి దిగారు. అనంతపురం జిల్లా కదిరిలో గుట్టుగా సాగుతున్న బెట్టింగ్ పై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఏడుగురు బెట్టింగ్ రాయుళ్లు అరెస్టయ్యారు. బెట్టింగ్ రాయుళ్ల నుంచి రూ.87 నగదు, సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News